శ్రీశైలం పవర్ హౌస్ అగ్ని ప్రమాదంపై ఎపి గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ తీవ్ర విచారం
- August 21, 2020
విజయవాడ:శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భూగర్భ హైడెల్ పవర్ హౌస్‌లో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ప్రమాదం కారణంగా ఆరుగురు ఉద్యోగులు మరణించగా, 15 మందిని రక్షించారన్నారు. పవర్‌హౌస్ లోపల చిక్కుకున్న ఆరుగురు ఉద్యోగులను రక్షించడం సాధ్యం కాని పరిస్థితిలో వారు మృతి చెందటం పట్ల గవర్నర్ హరిచందన్ ఒక సందేశంలో విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు గవర్నర్ తన సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







