ఒమన్ విజన్ 2040 ప్రమోట్ చేసేలా పరిపాలన విభాగంలో కొత్త నియామకాలు

- August 21, 2020 , by Maagulf
ఒమన్ విజన్ 2040 ప్రమోట్ చేసేలా పరిపాలన విభాగంలో కొత్త నియామకాలు

మస్కట్:మజ్లిస్ యాష్ షురా కోరుకున్నట్లు ఒమన్ ప్రభుత్వం విజన్ 2040 దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిపాలన విభాగంలో స్థానిక యువతను నియమిస్తూ రాయల్ డిక్రీలు వెలువడటం పట్ల మజ్లిస్ యాష్ షురా ప్రశంసలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన యువతను నియమించాలనే నిర్ణయం..ఒమన్ విజన్ 2040 లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉందని, ఒమన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని అభిప్రాయపడింది. మజ్లిస్ యాష్ షురా సభ్యులను పరిపాలన విభాగంలో నియమించుకోవటం..ఒమన్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయని పేర్కొంది. అలాగే మజ్లిస్, ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహనకు దోడ్పతుందని తెలిపింది. అంతేకాదు..ప్రభుత్వంలో మహిళా మంత్రులకు, పరిపాలన విభాగంలో మహిళా అధికారులకు స్థానం కల్పించటాన్ని మజ్లిస్ కొనియాడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com