దిల్లీ బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబునాయుడు..

- February 07, 2016 , by Maagulf
దిల్లీ బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబునాయుడు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చే సమయంలో సీఎం చేసే ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఆర్థికలోటు, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com