డిస్టెన్స్ లర్నింగ్ వైపే సౌదీ ప్రభుత్వం మొగ్గు...
- August 23, 2020
రియాద్:సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రస్తుతానికి డిస్టెన్స్ లర్నింగ్ ద్వారానే విద్యావిధానం కొనసాగించాలనే నిర్ణయంతో ఉంది. ఆగస్ట్ 30న ఈ విద్య సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో స్కూల్స్ నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరగతుల నిర్వహణ తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఆగస్ట్ 30 నుంచి తొలి ఏడు నెలలు డిస్టెన్స్ లర్నింగ్ ద్వారానే విద్యా విధానాన్ని కొనసాగిస్తామని, ఆ తర్వాతే క్లాస్ అటెండెన్స్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ఒక వేళ ఆలోగా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే డిస్టెన్స్ లెర్నింగ్ విధానాన్ని పొడిగిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి కోవిడ్ 19 ప్రభావంపై అంతా గందరగోళ వాతావరణమే కనిపిస్తోందని, వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు, ఏడువారాల తర్వాత వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అందువల్ల తొలి ఏడు వారాలు దూర విద్య ద్వారా తరగతులు నిర్వహించి ఆ తర్వాత అప్పటి పరిస్థితులు, కరోనా తీవ్రత, వ్యాక్షిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలను సమీక్షించుకొని క్లాస్ అటెండెన్స్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఒక వేళ వ్యాక్సిన్ రావటం మరింత ఆలస్యం అవుతుంది అనుకుంటే దూర విద్య విధానాన్ని మరికొన్నాళ్లు పొడిగించే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?