స్నేహితుని కోసం మరలా అదేపని చేయనున్న త్రివిక్రమ్

- August 23, 2020 , by Maagulf
స్నేహితుని కోసం మరలా అదేపని చేయనున్న త్రివిక్రమ్

`అల వైకుంఠపురములో..` లాంటి  ఇండస్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో సినిమా చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్. అయితే ఎన్టీయార్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`తో లాక్ అయిపోయాడు. 

ఆ సినిమా పూర్తి చేసి ఎన్టీయార్ ఫ్రీ కావడానికి కనీసం ఏడెనిమిది నెలలు పట్టేలా కనిపిస్తోంది. ఈ లోపు త్రివిక్రమ్ ఓ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారట. అయితే డైరెక్టర్‌గా కాదు.. రచయితగానట. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చేయబోతున్న ఓ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్లీ రచయితగా మారబోతున్నారట. రచనా సహకారం అందించబోతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com