తెలంగాణ లో కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 24, 2020
హైదరాబాద్: తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091 కు చేరింది. తాజాగా ఆరు మంది కరోనా బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 761 కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 1825 మంది కోలుకుని ఆదివారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 82,411 మంది కోవిడ్ పేషంట్లు ఇప్పటివరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!