భారత్ లో 61 వేల కేసులు‌, 836 మరణాలు

- August 24, 2020 , by Maagulf
భారత్ లో 61 వేల కేసులు‌, 836 మరణాలు

న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే రోజు వారీ కేసులతో పోలిస్తే మాత్రం చాలా వరకు తక్కువగానే వచ్చాయి నిన్న. గత 24 గంటల్లో భారతదేశంలో 61,408 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 57,468 మంది కరోనా నుంచి నిన్న కోలుకున్నారు. 836 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 31,06,349కు చేరుకుంది.

23,38,036 మంది నేటి వరకు కరోనా నుంచి కోలుకుని బయటకు వచ్చారు. ఇప్పటి వరకు 57,542 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశంలోని దక్షిణ భారత దేశం కరోనాతో ఎక్కువగా అవస్థలు పడుతుంది. తమిళనాడు,ఏ.పి లో ప్రతీ రోజు 15 వేల వరకు నమోదు అవుతున్నాయి. కర్ణాటకలో కూడా తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు మరణాల రేటు కూడా ఆ రాష్ట్రంలో అధికంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com