ప్రతిరోజూ 2,300 ర్యాండం టెస్టుల నిర్వహణ

- August 24, 2020 , by Maagulf
ప్రతిరోజూ 2,300 ర్యాండం టెస్టుల నిర్వహణ

మనామా: కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించే క్రమంలో హెల్త్‌ మినిస్ట్రీ, కోవిడ్‌ 19 ర్యాండం టెస్టింగ్‌ నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లూ కలిగిన మొబైల్‌ టెస్టింగ్‌ యూనిట్స్‌ ద్వారా ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏరియాలో 300 నుంచి 400 వరకు టెస్టుల చొప్పున మొత్తంగా 2,300 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. లక్షణాలు బయటకు కన్పించనివారి వివరాలు ఈ పరీక్షలతో తెలిసే అవకాశం వుంది. మరోపక్క, ప్రికాషనరీ మెజర్స్‌ పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్‌ అజూర్‌ మాట్లాడుతూ, ఇంటీరియర్‌ మినిస్ట్రీ, సివిల్‌ డిఫెన్స్‌ ఈ విషయంలో తమకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com