తెలంగాణ:స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
- August 24, 2020
హైదరాబాద్:కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధన ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ తరగతుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యా సంవత్సర ప్రారంభం సహా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జరపాలి అన్న అంశాలపై ప్రభుత్వం చర్చించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







