ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి
- August 24, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా మరో 740 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 28 మంది చనిపోయినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 84,509కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 637కి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సూప్రీం కమిటీ సూచనల మేరకు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్కులు ధరించాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







