సౌదీ: కరోనా నియంత్రణ మార్గనిర్దేశకాలను పాటించని 29 షాపింగ్ మాల్స్ పై చర్యలు
- August 24, 2020
రియాద్:సౌత్ వెస్ట్ సౌదీ అరేబియాలోని అసిర్ ప్రాంతంలో కరోనా వ్యాప్తి నియంత్రణ జాగ్రత్తలను పాటించని షాపింగ్ మాల్స్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 29 షాపింగ్ మాల్స్ ను సీజ్ చేశారు. సౌదీ మార్గనిర్దేశకాల ప్రకారం మాల్ సిబ్బందికి డిసిన్ఫెక్షన్, సానిటైజర్ వసతి కల్పించాలని, అలాగే సిబ్బందికి వినియోగదారులకు టెంపరేచర్ చెక్ చేయాలని అసిర్ రిజియన్ మేయర్ డాక్టర్ వలిద్ అల్ హమిది వివరించారు. అలాగే షాపింగ్ మాల్స్ లోని ట్రాలీలు, బాస్కెట్లను తరచు శానిటైజ్ చేయాలని ఆయన అన్నారు. పిల్లల ఆటప్రాంగణాన్ని మూసివేయాలన్నారు. అంతేకాదు..షాపింగ్ మాల్ సిబ్బంది మాల్స్ లోగానీ, బయటగానీ పరిమితికి మించి ఒకే చోట గుమికూడొద్దని, ఒక వేళ పరిమితికి మించి ఒకే చోట చేరితే ప్రతి వ్యక్తికి 5000 రియాల్స్ నుంచి లక్ష రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?