శ్రీ సూర్య ప్రొడక్షన్స్ 'జి' ఫస్ట్ లుక్ విడుదల!
- August 24, 2020
హైదరాబాద్:శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూర్య నిర్మాతగా వ్యవహరిస్తూ దీపిక, ఆర్యన్ అనే ఇద్దరు నూతన దర్శకులుగా చేస్తోన్న తొలి చిత్రం జెడ్ 'జాంబీ' అనే ఉపశీర్షిక తో మన ముందుకు రాబోతున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ దీపిక మాట్లాడుతూ....
ఇప్పటి వరుకు మన తెలుగు లో ఎవరు ట్రై చేయని జాంబీ అనే కల్పిత పాత్రను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాము. మాకు వున్న పరిధిలో బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ తో చిత్రం వర్క్ చేయడం ఆనందంగా వుంది, మా ఈ తొలి చిత్రాన్ని మీ అందరూ చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామని తెలిపారు.
హీరో మరియు డైరెక్టర్ ఆర్యన్ మాట్లాడుతూ....
మేము మొదటిసారి జాంబీస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాము. ఈ చిత్ర కథ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.
నిర్మాత సూర్య మాట్లాడుతూ...
మొదటి సారి ఈ కథ విన్నప్పుడు దర్శకులు చెప్పిన విధంగా ఈ చిత్రాన్ని తియ్యగలరా అనిపించింది, కానీ సినిమా పూర్తి అయ్యాక ఔట్ పుట్ చూశాను, అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వారు ఏదైతే చెప్పారో అదే తీశారు, ఆడియన్స్ కూడా తప్పకుండా ఈ సినిమాను ఇష్టపడి చూస్తారని అనుకుంటున్నాను. ఏంతో అనుభవం కలిగిన వారిలాగా దీపిక, ఆర్యన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాతో సహా 20 మంది నూతన నటీనటులను నా బ్యానర్ లో ఇలాంటి కథ తో మి ముందుకు వస్తునందుకు చాలా ఆనందంగా మరియు గర్వంగా వుంది. మీ అందరి ప్రోత్సాహంతో మరిన్ని వైవిధ్యమైన కథలతో మీ ముందుకు మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







