రస్ ఆల్ ఖైమాలో వాణిజ్య సంస్థలకు ఊరట..లైసెన్స్ ఫీజుల రాయితీ, ఫైన్స్ మాఫీ

- August 24, 2020 , by Maagulf
రస్ ఆల్ ఖైమాలో వాణిజ్య సంస్థలకు ఊరట..లైసెన్స్ ఫీజుల రాయితీ, ఫైన్స్ మాఫీ

యూఏఈ:కరోనా నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి రస్ ఆల్ ఖైమా ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వాణిజ్య సంస్థల ట్రెడ్ లైసెన్స్ ఫీజులో రాయితీలు ఇచ్చారు. అలాగే లాక్ డౌన్ సమయంలో విధించిన జరిమానాలను అన్నింటిని మాఫీ చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రస్ అల్ ఖైమా పారిశ్రామిక రంగానికి చేయూతగా నిలిచేందుకు రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ మినహాయింపులు ప్రకటించారు. ప్రస్తుతం రస్ అల్ ఖైమా వాణిజ్య రంగం మెరుగైన ఫలితాలే సాధిస్తున్నప్పటికీ... దేశ ఆర్ధిక రంగానికి కీలకమైన పారిశ్రామిక రంగంలో మళ్లీ సాధారణ స్థాయిని కల్పించటమే లక్ష్యంగా ఈ వెసులుబాట్లు కల్పించారు. దీంతో పలు పరిశ్రలమకు తమ వార్షిక వాణిజ్య లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ దక్కనుంది. ఇక లాక్ డౌన్ మార్గనిర్దేశకాల మేరకు మూతపడిన సంస్థలకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మరోవైపు లాక్ డౌన్ సమయంలో వాణిజ్య సంస్థలపై విధించిన జరిమానాలను మాత్రం పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు రస్ అల్ ఖైమా ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com