'పుల్వామా' ఛార్జిషీట్‌లో మసూద్ అజర్ పేరును చేర్చిన ఎన్‌ఐఏ
- August 25, 2020
న్యూఢిల్లీ: పుల్వామా దాడి కేసులో జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌తో పాటు ఆయన సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును జాతీయ దర్యాప్తు బృందం చార్జిషీట్‌లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులంటూ ఎన్‌ఐఏ ఆ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) మంగళవారం జమ్మూ కోర్టులో సమర్పించనుంది. అత్యంత ఘోరకమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు? పాక్ నుంచి ఎలా అమలు చేశారో అధికారులు క్షుణ్ణంగా వివరించారు.
అంతేకాకుండా జైషే మహ్మద్‌కు చెందిన 20 మంది ఉగ్రవాదులకు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్‌లో తెలిపింది. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్‌ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?