భయంతో ఆ పని చేయద్దు అంటున్న వైద్యులు

- August 25, 2020 , by Maagulf
భయంతో ఆ పని చేయద్దు అంటున్న వైద్యులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసృతంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతీ రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టేన్స్ పాటించడం లాంటి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఆహారపదార్ధాల విషయంలో కొంతమంది జాగ్రత్తల పేరుతో కొన్ని తప్పిదాలు చేస్తున్నారు. వీటిని సరిచేసుకొకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని వైద్యులు అంటున్నారు. 

కరోనా వైరస్ కారణంగా చాలా మంది కాయగూరలు, పండ్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలుపై శానిటైజ్ స్ప్రే చేస్తున్నారు. మరికొందరు ఏకంగా డిటర్జెంట్ నీటిలో వీటిని కొంతసేపు నానబెట్టి ఆ తర్వాత మామూలు నీటితో కడిగి అప్పుడు వాడుతున్నారు. నిజానికి ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపైన శానిటైజర్‌ స్ప్రే చేయవచ్చు. కానీ.. కాయగూరలు, పండ్లను మాత్రం శానిటైజర్‌ స్ప్రే చేయడం. లేదా డిటర్జెట్ నీటిలో నానబెట్టడం చేయకూడదు. అలా చేస్తే శానిటైజర్‌లో ఉంటే ఆల్కహాల్ మరియు డిటర్జెంట్ లో ఉండే రసాయన అవశేషాలు పండ్లు, కూరగాయలపై ఉండిపోవడంమే కాకుండా వీటిలోని పోషకాలన్నింటిని నశింపజేస్తాయి. వీటిని తినడం వల్ల గ్యాస్టిక్, జీర్ణ సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సహజసిద్ధంగా క్రిమి సంహారక ద్రావణాలను తయారుచేసుకొని పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేసుకోవాలే తప్పా ఇలాంటి పనులు చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు...!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com