కొత్త ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు
- February 08, 2016
బహ్రెయిన్‌లో 82 శాతం ఎల్ఈడీ ట్రాఫిక్ లైట్స్‌ని ఏర్పాటు చేశారు. వీటిద్వారా వాహన ప్రమాదాల్ని నియంత్రించడానికి వీలవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయిలో ట్రాఫిక్ లైట్స్‌ని ఎల్ఈడీ లైట్స్‌తో రీప్లేస్ చేసే ప్రోగ్రామ్ మార్చ్ నాటికి పూర్తవుతుందని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ రోడ్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ డైరెక్టర్ ఖాదిమ్ అబ్దుల్ లతీఫ్ చెప్పారు. విద్యుత్ వినియోగంతోపాటు, ట్రాఫిక్ లైట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎల్ఈడీ లైట్లతో తగ్గుతుందని అబ్దుల్ లతీఫ్ చెప్పారు. వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులతో సాధారణ ట్రాఫిక్ లైట్స్ దెబ్బ తింటాయనీ, ఎల్ఈడీ లైట్లతో ఆ సమస్య ఉండదని ఆయన అన్నారు. ఫాగీ కండిషన్స్‌లో కూడా అద్భుతమైన విజిబిలిటీ, సంప్రదాయ లైట్లతో పోల్చితే 25 శాతం తక్కువ విద్యుత్ వినియోగం వంటివి ఎల్ఈడీ లైట్లతో సాధ్యమవుతాయి. ఖరీదు ఎక్కువైనప్పటికీ, మన్నికతో పోల్చితే ఆ ఖర్చు సబబేనని అబ్దుల్ తీఫ్ వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







