ఒమన్ విడిచి 6 నెలలు దాటినా తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక వెసులుబాటు
- August 25, 2020
మస్కట్:ఒమన్ రెసిడెన్సీ వీసాదారులు దేశం విడిచి 6 నెలలు దాటినా..కొన్ని ప్రత్యేక మినహాయింపులతో తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించింది ఆ దేశ ప్రభుత్వం. రాయల్ ఒమన్ పోలీసుల నుంచి మినహాయింపు పొందినట్లు అనుమతి పొంది తిరిగి రావొచ్చని స్పష్టం చేసింది. సుల్తానేట్ వెలుపల ఉండి 180 రోజులు దాటితే యజమానిగానీ, కార్మికులుగానీ మినహాయింపు పొందేందుకు పాస్ పోర్ట్, రెసిడెన్సీ సాధారణ పరిపాలనా విభాగంలోని ఆర్ధిక వ్యవహారాలు, పరిపాలన విభాగం అధికారులకు ముందుగా ఓ దరఖాస్తు చేసుకోవాలి. అయితే..దరఖాస్తుదారుడి పాస్ పోర్టు ఖచ్చితంగా ఇంకా చెల్లుబాటులో ఉండాలి. పాస్ పోర్టు కాపీ లేదా యజమానిగానీ, కార్మికుడికి చెందిన ఐడీ కార్డు కాపీ జతపర్చాలి. వాణిజ్య రిజిస్ట్రేషన్ పేపర్ కాపీ, కంపెనీ అధికారిక ముద్రతో కూడిన కాపీని దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. వీటికితోడు 14 రోజుల తర్వాత తిరిగి వెళ్లేందుకు వీలుగా తీసుకునన రిటర్న్ టికెట్ ను కూడా జతపరచాల్సి ఉంటుంది. కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు తిరిగి వచ్చేందుకు వీలుగా ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







