వారికి అండగా ఉండండి- హీరో సుమన్
- August 26, 2020ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని ప్రముఖ నటుడు సుమన్ తన అభిమానులకు సూచించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నా అభిమానులు కేకులు కట్ చేయడం, హడావుడి చేయడం చేస్తుంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా ప్రజలు గుమికూడే పరిస్థితి లేదు. పైగా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే అభిమానులు హడావుడి చేయకూడదని సూచిస్తున్నాను. వీలైతే కరోనా నుండి ప్రజలను కాపాడ్డం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి అండగా ఉండాలని, వారికి సేవలు అందించాలని సుమన్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా తను ఇంటికే పరిమితం అయినట్టుగా సుమన్ తెలిపారు. తన నట జీవితంలో ఇంతటి ఇన్ని రోజులు షూటింగ్ చేయకుండా ఉండలేదని అన్నారు. షూటింగ్ లో పాల్గొనడానికి త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఆశిస్తున్నాను. మధ్యలో నిలిచిపోయిన చిత్రాలను పూర్తిచేయాల్సి ఉందని సుమన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!