కువైట్ లో ఉన్న ప్రవాసీయులు, పర్యాటకుల వీసా గడువు 3 నెలలు పెంపు
- August 27, 2020
కువైట్ సిటీ:ఆగస్ట్ చివరి నాటికి వీసా గడువు ముగిసే వారికి గుడ్ న్యూస్ అందించింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయులు, పర్యాటకులకు సంబంధించి రెసిడెన్సీ, వీసా గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ఈ వెసులుబాటు కేవలం కువైట్ లో ఉన్నవారికి మాత్రమే అని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆగస్ట్ 31 నాటికి గడువు ముగిసే వీసాలు నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే..ఈ లోగానే ప్రవాసీయుల స్పాన్సర్లు, యజమానులు వారి వీసాలను రెన్యూవల్ చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆన్ లైన్ ద్వారాగానీ, రెసిడెన్సీ వ్యవహారాల కార్యాలయాల్లోగానీ వీసాలను రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు దేశంలో చిక్కుకుపోయిన పర్యాటకులు సైతం నవంబర్ 30 నాటికి తిరుగు ప్రయాణంలో అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







