రియాద్ లో SR 8,00,000 విలువైన కేబుల్స్ చోరీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

- August 27, 2020 , by Maagulf
రియాద్ లో SR 8,00,000 విలువైన కేబుల్స్ చోరీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్ట్

రియాద్:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ లో SR 8,00,000 విలువైన ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎలక్ట్రిసిటి కట్టర్స్ ను దొంగిలించిన కేసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. సుడాన్ కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా రియాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. గోడౌన్లను లక్ష్యంగా చేసుకొని ఇప్పటివరకు 24 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగిలించిన వైర్లను తూర్పు రియాద్ లోని ఓ ప్రాంతంలో జమచేసి వాటి నుంచి రాగిని తీసి అమ్ముకుంటారని పోలీసులు వివరించారు. ఇదిలాఉంటే మరో ఘటనలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఐదురుగు అఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 81 బ్యారెల్స్ అల్కాహాల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సౌదీ అరేబియా చట్టాల మేరకు అక్రమంగా మద్యం తయారు చేయటం, అమ్మటం నిషేధమని...అలాంటివారి పట్ట కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com