షార్జాలో రెండేళ్ళ కార్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అమల్లోకి
- August 27, 2020
యూఏఈ: రెండేళ్ళ రిజిస్ట్రేషన్ లైసెన్స్ (ముల్కియా), కొత్త లైట్ వెహికిల్స్ కోసం అమల్లోకి వచ్చింది షార్జాలో. ఈ మేరకు అథారిటీస్ ఓ ప్రకటన చేశాయి. వాహనాలు అలాగే డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ - షార్జా పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రెండేళ్ళ ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ లైసెన్స్, చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్‌కి అనుగుణంగా జారీ చేయబడుతుంది. హై క్వాలిటీ పోలీస్ సర్వీసెస్‌లో భాగంగా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ అల్ షామ్సి మాట్లాడుతూ, సర్వీసుల అప్‌గ్రేడేషన్ కోసం మెరుగైన విధానాల్ని అవలంబిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోవడానికి వాహనదారులు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటయ్యే సర్టిఫికెట్‌ని సమర్పించాల్సి వుంటుందని వెహికిల్స్ అండ్ డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలెద్ అల్ కాయి చెప్పారు. ఈ విధానం ‘ఆప్షనల్’ అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?