సెప్టెంబర్‌ 1 నుంచి మాస్క్‌ల పాక్షికంగా పునఃప్రారంభం

- August 27, 2020 , by Maagulf
సెప్టెంబర్‌ 1 నుంచి మాస్క్‌ల పాక్షికంగా పునఃప్రారంభం

కతార్‌, మాస్క్‌లను రీ-ఓపెన్‌ చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతోంది. సెప్టెంబర్‌ 1 నుంచి మాస్క్‌లు పాక్షికంగా పునఃప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. టాయిలెట్స్‌ మూసివేత, అబ్లషన్‌ ప్లేస్‌ల మూసివేత వంటివి పాటిస్తూ, మాస్క్‌ల పునఃప్రారంభానికి స్టేట్‌ కమిటీ కొన్ని గైడ్‌ లైన్స్‌ జారీ చేసింది. కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి వెడ్డింగ్‌ పార్టీస్‌కి అనుమతినిస్తున్నారు. అయితే, టేబుల్‌కి ఐదుగురు వ్యక్తులు మాత్రమే వుండాలి ఈ పార్టీల్లో. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సాధారణ కెపాసిటీలో 30 శాతం సామర్థ్యంతోనే నడిపేందుకు కూడా అనుమతినిచ్చారు. అయితే, తప్పనిసరిగా కరోనా ప్రికాషన్స్‌ అన్ని సందర్భాల్లోనూ పాటించాల్సి వుంటుంది. స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కి ఇండోర్‌లో కేవలం 20 శాతం మంది అభిమానులకే అవకాశం వుంటుంది. అదే ఔట్‌ డోర్‌లో అయితే 30 శాతం మందికి అవకాశం కల్పించవచ్చు. ప్రైవేట్‌ మెడికల్‌ క్లినిక్స్‌ పూర్తి సామర్థ్యంతో తెరుచుకోవచ్చు. పరిస్థితుల్ని బట్టి సెప్టెంబర్‌ మధ్యలో హెల్త్‌ సిట్యుయేషన్‌ని సమీక్షిస్తారు. కతార్‌లో ఇప్పటిదాకా 117,742 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com