అంతర్జాతీయ ప్రయాణీకులకు క్వారంటైన్ గైడ్‌లైన్స్: జిఎంఆర్
- August 28, 2020
హైదరాబాద్:విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొంది జీఎంఆర్. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే ప్రయాణీకులకు సంబంధించి క్వారంటైన్ గైడ్ లైన్స్‌ని విడుదల చేశారు. ప్రయాణీకులు 96 గంటల ముందుగా తీసుకున్న ఆర్టి-పిసిఆర్ టెస్ట్ రిపోర్ట్‌ని తమ వెంట తీసుకురావాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ, కుటుంబంలో ఎవరైనా చనిపోయిన కారణంగా వస్తున్నా, తల్లిదండ్రులకు అనారోగ్యం, 10 ఏళ్ళలోపు పిల్లలకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరి. బిజినెస్ రీజన్స్‌తో వచ్చేవారు ఆర్టి-పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్‌ని 96 గంటలకు ముందుగా తీసుకున్నది తమ వెంట తీసుకువస్తే, అలాంటివారికి క్వారంటైన్ వుండదు. కానీ, వీరు 4 రోజుల్లోగా తిరుగు ప్రయాణమవ్వాలి. అందుకు సంబంధించిన కన్ఫర్మ్డ్ రిటర్న్ టికెట్ కూడా చూపించాలి. పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగతా ప్రయాణీకులు ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అలాగే ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పక పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!