షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

- August 28, 2020 , by Maagulf
షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

షార్జా: ఓ ట్రక్‌, మరో రెండు వాహనాల్ని ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అల్‌ ధయిద్‌, షార్జా రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు మరియు ఆరు ఇంటర్‌ఛేంజ్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.20 నిమిషాల సమయంలో షార్జా పోలీస్‌ ఆపరేషన్‌ రూమ్ కి ఈ ఘటనపై తొలుత సమాచారం అందింది. వెంటనే ఎమర్జన్సీ క్రూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఓ ట్రక్‌ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాల్ని క్లియర్‌ చేసి, ట్రాఫిక్‌కి అనుమతించారు. వాహనదారులు వాహనాల టైర్ల పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీస్‌ జనరల్‌ కమాండ్‌ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com