తూర్పు సౌదీ ప్రాంతంలో 859 చోట్ల తనిఖీలు..
- August 29, 2020
రియాద్:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీలోని దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అధికారులు సూచించిన మార్గనిర్దేశకాల అమలు తీరుకు సంబంధించి విస్తృత తనిఖీలు చేపట్టింది. మున్సిపాలిటి పరిధిలో ఏకంగా 859 చోట్ల తనిఖీలు నిర్వహించి కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. ప్రజల సంరక్షణార్ధం సౌదీ ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలను పలు చోట్ల ఉల్లంఘించినట్లు తమ తనిఖీల్లో మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. 41 చోట్ల కరోనా నియంత్రణ జాగ్రత్త చర్యలు పాటించటం లేదని నిర్ధారించుకొని తగిన చర్యలు చేపట్టారు. అదేసమయంలో నగరంలో 785 చోట్ల క్రిమిసంహారక చర్యలు కూడా చేపట్టినట్లు దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







