IPL 2020:13 మందికి కోవిడ్-19 పాజిటివ్..

- August 29, 2020 , by Maagulf
IPL 2020:13 మందికి కోవిడ్-19 పాజిటివ్..

న్యూ ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో పాల్గోనున్న టీమ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు.‌ ఈ విషయాన్ని BCCI శనివారంనాడు ధ్రువీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల 1,988 కోవిడ్-19 పరీక్షలు జరపగా, 13 మంది కరోనా బారినపడినట్టు గుర్తించామని తెలిపింది. వీరిని ఇతర టీమ్ సభ్యుల నుంచి దూరంగా ఉంచుతామని పేర్కొంది.

యూఏఈలో పాల్గోనే అన్ని టీమ్‌లకు చెందిన 1,988 మందికి ఆగస్టు 20 నుంచి 28 వరకూ ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్ పరీక్షలు జరిపాం. వారిలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ మేనేజిమెంట్, BCCI సిబ్బంది, IPL ఆపరేషనల్ టీమ్, హోటల్, గ్రౌండ్ ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది ఉన్నారు' అని BCCI తెలిపింది. ఇద్దరి ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వీరంతా IPL మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని వివరించింది.

IPL 2020 'హెల్త్ అండ్ సేఫ్టీ' ప్రోటోకాల్ ప్రకారం, IPL-2020 సీజన్ పూర్తయ్యేంత వరకూ  పార్టిసిపెంట్లకు నిరంతర పరీక్షలు నిర్వహిస్తామని BCCI చెప్పింది. 12 మంది చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇంతకు ముందు వార్తలు వచ్చినప్పటికీ, టీమ్ పేరు మాత్రం BCCI వెల్లడించలేదు.

టీ-20 టోర్నమెంట్ 13వ అడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌ ఓ మంగళవారం జరుగుతుంది. ఒక మామూలు రోజులో ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం టోర్నమెంట్ హిస్టరీలో మంగళవారం ఇదే మొదటిసారి. ఇంతకుముందు, కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్‌ను BCCI వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com