సోమవారంతో ముగియనున్న వర్క్‌ బ్యాన్‌

- August 29, 2020 , by Maagulf
సోమవారంతో ముగియనున్న వర్క్‌ బ్యాన్‌

మనామా:జులై 1న ప్రారంభమైన ఔట్‌ డోర్‌ వర్క్‌ బ్యాన్‌ సోమవారంతో ముగియనుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది వర్క్‌ బ్యాన్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. 2007లో ఈ వర్క్‌ బ్యాన్‌ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌ 300000కి పైగా వర్క్‌ సైట్స్‌, 150,000 మంది కార్మికులతో కూడిన కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ చాలా సవాళ్ళను ఎదుర్కొంది ఈ సమయంలో. తొలుత కేవలం కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌కి మాత్రమే ఈ సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ అమలు చేసినా, ఆ తర్వాత వివిధ రంగాలకు విస్తరించడం జరిగింది. కాగా, ఈ ఏడాది లేబర్‌ మినిస్ట్రీ 6,315 తనిఖీల్ని నిర్వహించింది. 27 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై పలు ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 37 మంది కార్మికుల్ని జ్యుడీషియరీకి రిఫర్‌ చేయడం జరిగింది. మినిస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ జమీల్‌ హుమైదీన్‌ మాట్లాడుతూ, వేసవి తీవ్రత నేపథ్యంలో కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం వుంది గనుక, వారికి ఈ సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ ఉపశమనం కల్గిస్తుందనీ, ప్రైవేట్‌ సెక్టార్‌ కంపెనీలు 98 శాతం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com