ఇజ్రాయెలీ గూడ్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

- August 29, 2020 , by Maagulf
ఇజ్రాయెలీ గూడ్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

యూఏఈ:ఇజ్రాయెలీ కంపెనీలతో యూఏఈకి చెందిన వ్యక్తులు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా ఇజ్రాయెలీ బాయ్‌ కట్‌ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యూఏఈ - ఇజ్రాల్‌ మధ్య శాంతి చర్చలు సఫలమయిన నేపథ్యంలో గతంలో వున్న బ్యాన్‌ని రద్దు చేస్తూ షేక్‌ ఖలీఫా ఫెడరల్‌ డిక్రీ లా నెంబర్‌ 4 ఆఫ్‌ 2020ని విడుదల చేశారు. ఇజ్రాయెల్‌తో డిప్లమాటిక్‌ మరియు కమర్షియల్‌ కో-ఆపరేషన్‌కి ఈ డిక్రీ మార్గం సుగమం చేస్తోంది. ఈ నిర్ణయంతో యూఏఈలో ఇజ్రాయెల్‌ గూడ్స్‌ ట్రేడ్‌కి వీలు కలుగుతుంది. ఎకమనిక్‌ గ్రోత్‌లో భాగంగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని గతంలోనే నిర్ణయించుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com