సైబరాబాద్లో 10 మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- August 29, 2020
హైదరాబాద్: సైబరాబాద్లో పది మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా సభ్యులపై ఇప్పటికే పలు కేసులున్నాయని చెప్పారు. నగరంలోని జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ కాలనీలో దొంగలు షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. ముఠా సభ్యులు దొంగతనాల్లో ఆరితేరారని చెప్పారు. చోరీకి పాల్పడే ప్రాంతాన్ని ముందే పూర్తిగా పరిశీలిస్తారని… నేరం చేసే ప్రయత్నంలో ఆయుధాలు ఉపయోగిస్తారని చెప్పారు. అంతేకాదు చోరీ సమయంలో అడ్డువచ్చేవారిని చంపేందుకైనా వెనుకాడరన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడ్డారని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉన్నదని చెప్పారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్.



తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







