ఆన్ లైన్ లో విద్యార్ధుల అడ్మిషన్ రిజిస్ట్రేషన్, బదిలీ ప్రక్రియ దరఖాస్తులు
- August 30, 2020
దోహా:కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఖతార్ ప్రభుత్వం..విద్యాశాఖలో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ స్కూల్స్ కు సంబంధించి అన్ని సేవలను ఆన్ లైన్ లో అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్ట్ 30 నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులు ఎవరు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావొద్దని కూడా సూచించింది. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ లో పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పాఠాశాలలకు సంబంధించిన సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చని తెలిపింది. https://eduservices.edu.gov.qa/ లింక్ ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రులు సర్టిఫికెట్ సేవలు, పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్ దరఖాస్తు, ఇతర స్కూల్స్ కు విద్యార్ధుల బదిలీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ఫీజ్, పుస్తకాల ఫీజు చెల్లింపులు, ట్రాన్స్ పోర్ట్ ఫీజు చెల్లింపులు చేయవచ్చని విద్యాశాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన