చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి

- August 30, 2020 , by Maagulf
చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి

బీజింగ్‌:చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యమే. అక్కడ ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 29 మంది మరణించారన్న వార్త వచ్చింది. లిన్‌ఫెన్‌ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్‌ భవనం శిథిలాల నుంచి మొత్తం 59 మందిని బయటకు తీశారు. వీరిలో 29 మంది మరణించారని, 21 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.భవనం కూలిపోవడానికి కారణాలు తెలియవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com