సౌదీ:అక్రమ వలస కార్మికులు వైరస్ వ్యాప్తికి కారణం..వారి పంపించాలంటూ స్థానికుల డిమాండ్
- August 30, 2020
రియాద్:వలస కార్మికుల తీరుపై అల్ ఖొబర్ తూర్పు ప్రాంతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన నిబంధనలేవి పాటించకుండా వలస కార్మికులు వైరస్ వ్యాప్తి కారకాలుగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు. మహమ్మారిని అరికంట్టేందుకు కింగ్డమ్ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నా..వలస కార్మికులు మాత్రం అధికారులు మార్గనిర్దేశకాలను పట్టించుకోకుండా ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా గుమిగూడుతున్నారని, శానిటైజర్లు వాడటం లేదని, కనీసం మాస్కులు కూడా ధరించటం లేదని అల్ ఖొబర్ ప్రజలు వలస కార్మికుల తీరును తప్పుబడుతున్నారు. వలస కార్మికుల తీరుతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఇది వారి ప్రాణాలతో పాటు తమ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. ఒక్కో వలస కార్మికుడిని చూస్తుంటే ఓ వైరస్ బాంబును చూసినట్లు ఉందని అంటున్నారు. అక్రమంగా ఉంటున్న వలస కార్మికులను వెంటనే తమ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?