5 నెలలుగా బ్యాట్ పట్టుకోని కోహ్లి
- August 30, 2020
దుబాయ్:దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న IPL 13వ సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల21 వ తారీఖున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం దుబాయ్ చేరుకుందన్న విషయం తెలిసిందే... ప్లేయర్లందరూ క్వారంటైన్ పూర్తి చేసుకుని నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. దుబాయ్‌లో నిర్ణీత క్వారంటైన్ గడువు ముగించుకున్న ఆ జట్టు ప్లేయర్లు నెట్‌లో సాధన మొదలు పెట్టారు. ఇక ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ప్రాక్టీస్ చేశాడు.
అయితే ప్రాక్టీస్ తరువాత కోహ్లి మాట్లాడుతూ.. కరోనా వల్ల 5 నెలలుగా బ్యాట్ పట్టలేదని, తిరిగి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నానని.. అందువల్ల కొంత భయం వేసిందని అన్నాడు. అయినప్పటికీ ఈ ఐదు నెలలుగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నానని, అందువల్ల ప్రాక్టీస్‌లో పెద్దగా ఇబ్బంది కలగలేదని, ఇది కొంత వరకు సంతృప్తినిచ్చిందని అన్నాడు. కాగా కోహ్లితోపాటు ఆర్‌బీసీ ప్లేయర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్‌లు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు IPLలో ఇప్పటి వరకు రెండు సార్లు రన్నర్స్ అప్‌గా నిలిచింది. 2009, 2016లలో రెండో స్థానంలో ఆ జట్టు నిలిచింది. అయినప్పటికీ స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నా ఆ జట్టు ఇంకా ఐIPL ట్రోఫీని లిఫ్ట్ చేయలేదు. ఈసారైనా ట్రోఫీని సాధిస్తారా, లేదా చూడాలి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







