బహ్రెయిన్:మతధిక్కారం ఆరోపణలతో మతబోధకుడికి రిమాండ్

- August 30, 2020 , by Maagulf
బహ్రెయిన్:మతధిక్కారం ఆరోపణలతో మతబోధకుడికి రిమాండ్

మనామా:మహ్మద్ ప్రవక్త సహచరులను కించపరిచేలా అతివాద ఉపన్యాసం చేసిన ముస్లిం ప్రభోదకుడికి బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ రిమాండ్ విధించింది. నిందితుడు ఓ వీడియో ఫూటేజ్ లో మహ్మద్ ప్రవక్త సహచరులను అవమానపరిచేలా ప్రసంగించినట్లు స్పష్టంగా ఉందని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించేలా అతివాద చర్యలను ప్రొత్సహిస్తుందని ప్రాసిక్యూషన్ అధికారులు ఆరోపించారు. ఇది ఉగ్రవాద చర్యగానే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభోధకుడి ప్రసంగం ఫూటేజి ఆధారంగా అతన్ని కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చిందని, ఈ విచారణలో ప్రభోధకుడి వాదనను ఏకీభవించే విధంగా లేదని అన్నారు. బహ్రెయిన్ ర్యాజ్యాంగం, చట్టాల్లో పొందుపరిచిన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే..మతస్వేచ్ఛకు సంబంధించి భావ్రకటన స్వేచ్ఛ ఇతరులను కించపరిచేలా, అతివాద చర్యలను ప్రేరేపించేలా ఉంటే అది సమాజంలో హింసకు తావిస్తుందని కూడా ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com