బస్సు ప్రమాదానికి గురైన బాధితుడికి Dh2,00,000 నష్టపరిహారం

- August 31, 2020 , by Maagulf
బస్సు ప్రమాదానికి గురైన బాధితుడికి Dh2,00,000 నష్టపరిహారం

యూఏఈ: బస్సు ప్రమాదానికి గురైన బాధితుడికి Dh 2,00,000 పరిహారం చెల్లించాలని దుబాయ్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. బస్సు డ్రైవర్, ఇన్సూరెన్స్ సంస్థ పరిహారాన్ని భరించాలని ఆదేశించింది. ఆసియా దేశాలకు చెందిన కార్మికుడు..నిర్మాణ పనుల్లో ఉండగా అతన్ని బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. కార్మికులను పని ప్రదేశాలకు తరలించే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని కుడి కాలు 30 శాతం శాశ్వతంగా వైకల్యానికి గురైనట్లు మెడికల్ రిపోర్ట్ లో స్పష్టమైంది. అలాగే ఎడమ కాలుకు కూడా గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి తనను శాశ్వత వైకల్యం బారిన పడేలా చేసిన డ్రైవర్ తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ Dh4,00,000 పరిహారం ఇవ్వాలంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన దుబాయ్ న్యాయస్థానం..ఇన్సూరెన్స్ కంపెనీ అభ్యర్ధన మేరకు పరిహారాన్ని తగ్గిస్తూ..బాధితుడికి Dh2,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com