మస్కట్: ఒమన్ లో కొత్తగా 178 కరోనా కేసులు..8 మంది మృతి
- August 31, 2020
ఒమన్ లో కొత్తగా 178 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 85,722 మందికి పెరిగింది. మృతుల సంఖ్య 685కి చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఊరట కలిగించే అంశం. 85 వేల మందికి కరోనా వైరస్ బారిన పడితే..అందులో 80,810 మంది కోలుకోవటం విశేషం. గత 24 గంటల్లో 178 మందికి వైరస్ సోకితే..351 మంది రికవరి అయ్యారు. ఇదిలాఉంటే..వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం నిబంధనను అనుసరించటంతో పాటు..ఫేస్క్ మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం