దుబాయ్ రెస్టారెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..ఓ వ్యక్తి మృతి
- August 31, 2020
దుబాయ్ లోని ఓ రెస్టారెంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆసియా దేశాలకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంటర్నేషనల్ సిటీలోని నాలుగు అంతస్తుల రెస్టారెంట్ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ లో వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్ లీక్ అవటంతో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. మంటలు వేగంగా వ్యాప్తించటంతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి ధ్వంసమైనట్లు వివరించారు. సోమవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, తమకు సమాచారం అందగానే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని కేవలం 33 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేసినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం ఘటన జరిగిన భవనాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వయస్సు వివరాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!