పెద్దాయన కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ
- August 31, 2020
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులో మాటలు వినిపించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ఆగస్టు కార్యక్రమం డిస్‌లైక్‌ల్లో రికార్డు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన యూట్యూబ్ ఛానల్లో దీనిని పెట్టిన 24 గంటల్లోనే అత్యధికులు డిస్‌లైక్ చేసిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది. జాతిని ఉద్దేశించి మోదీ ఆదివారం రేడియో ద్వారా 'మన్ కీ బాత్' వినిపించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన దేశీయ కుక్కలను పెంచుకోవాలని, ఆట బొమ్మలను మన దేశంలోనే తయారు చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోదీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు. మొత్తం మీద ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 74 వేల మంది లైక్ చేశారు, 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారు.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏటికొప్పాక బొమ్మల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం