పార్కింగ్ పర్మిట్ టికెట్ ఫోర్జరీ చేసిన దుబాయ్ ప్రవాసీ

- September 01, 2020 , by Maagulf
పార్కింగ్ పర్మిట్ టికెట్ ఫోర్జరీ చేసిన దుబాయ్ ప్రవాసీ

దుబాయ్: గడువు ముగిసిన పార్కింగ్ పర్మిట్ టికెట్ ను దుబాయ్ ప్రవాసీ ఒకరు ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల దరఖాస్తు మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫోర్జరీ టికెట్ ను వినియోగించకుండా రద్దుచేసింది. కోర్టు రికార్డులు తెలిపిన ప్రకారం ఓ అరబ్ మహిళ అల్ కూజ్ లోని అల్ ఖైల్ ప్రాంతంలో తన కారును ఫోర్జరీ పార్కింగ్ పర్మిట్ టికెట్ తో పార్క్ చేసింది. అయితే..పార్కింగ్ టికెట్ కాలపరిమితిపై సందేహం కలగటంతో రోడ్లు, రవాణా శాఖ అధికారి ఒకరు పార్కింగ్ టికెట్ అర్హతపై ఎంక్వైరీ చేయటంతో అసలు విషయం బయటపడింది. పార్కింగ్ టికెట్ నెంబర్ సరిగ్గానే ఉన్నా..గడువు మాత్రం ఆరు నెలలకు ముందుగానే ముగిసినట్లు అధికారి గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో..టికెట్ ను పరిశీలించిన పోలీస్ ఫోరెన్సిక్ నిపుణులు పార్మింగ్ పర్మిట్ టికెట్ ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. అయితే..తనకు ఫోర్జరీ గురించి తెలియదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో వెల్లడించింది. తాను ఆ పార్కింగ్ టికెట్ ను వీధిలో అమ్ముతున్న ఓ అసియా వ్యక్తి దగ్గర్నుంచి Dh1,200లకు కొనుగోలు చేశానని తెలిపింది. అయితే..టికెట్ గడువును అధికారిక అర్హతను తాను టికెట్ కొనుగోలు చేసిన సమయంలో గమనించలేదని అంటోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com