ఖతార్ స్థానికులకు 4,800 ఉద్యోగావకాశాలు..కవదార్ వేదికగా సప్టెంబర్ 7 నుంచి అప్లికేషన్లు
- September 01, 2020
ఖతార్ ప్రభుత్వ స్థానిక నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4,800 ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు పరిపాలనా అభివృద్ధి, కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఖాళీల భర్తీకి జాతీయ ఉపాధి వేదిక కవదార్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, సెప్టెంబర్ 7 నుంచి నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చునని వెల్లడించింది. ఇక నుంచి ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉద్యోగాల జాబితాను సిద్ధం చేస్తామని, కవదార్ ద్వారా ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుత ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ ప్రక్రియను వేగవంతం చేస్తామని కూడా మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే...ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వారు తమ పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్లను దరఖాస్తులో పేర్కొంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రయ వేగవంతం చేయటం సులభం అవుతుందని తెలిపింది. రవాణా, సమాచార మంత్రిత్వ శాఖలోని నేషనల్ అథంటికేషన్ సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ఇదిలాఉంటే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి వేదిక కవదార్ ను గత సోమవారం ప్రారంభించిన విషయం తెలిసింది. కవదార్ ద్వారా ఖతార్ పౌరులు, ఖతార్ మహిళలకు కలిగిన సంతానానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వారి అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!