ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఫ్లై దుబాయ్'
- September 01, 2020
యూఏఈ: 'ఫ్లై దుబాయ్' ద్వారా సెప్టెంబర్ 1,2020 మరియు నవంబర్ 30,2020 మధ్య టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు స్వయంచాలకంగా కోవిడ్ -19 ఉచిత గ్లోబల్ ఇన్సూరెన్స్ అందించబడుతుందని బడ్జెట్ క్యారియర్ 'ఫ్లై దుబాయ్' మంగళవారం ప్రకటించింది.
దీని ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లయితే ప్రయాణీకుల ఆరోగ్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులను 'ఫ్లై దుబాయ్' భరిస్తుంది. ఈ కవర్ వారు ప్రయాణించిన సమయం నుండి 31 రోజులు చెల్లుతుంది. దీని ద్వారా ప్రయాణీకులకు వారి వైద్య ఖర్చులకు గాను 150,000 యూరోలు (660,600 దిర్హాములు) మరియు 14 రోజుల పాటు క్వారంటైన్ ఖర్చులకు గాను రోజుకు 100 యూరోలు (440 దిర్హాములు) వరకు ఈ కవరేజ్ నుండి ప్రయాణీకులు లబ్ది పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా అన్నారు.
జులై లో దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ ను తమ ప్రయాణీకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?