కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ సందర్శనకు అపాయింట్‌మెంట్‌ అక్కర్లేదు

- September 02, 2020 , by Maagulf
కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ సందర్శనకు అపాయింట్‌మెంట్‌ అక్కర్లేదు

కువైట్‌ సిటీ: యూనియన్‌ ఆఫ్‌ కన్స్యుమర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఛైర్మన్‌ ఫహాద్‌ అల్‌ కాస్తి, ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కో-ఆపరేటివ్స్‌లో షాపింగ్‌కి సంబంధించి ఇప్పటిదాకా అమల్లో వున్న అపాయింట్‌మెంట్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గవర్నరేట్స్‌కీ ఇది వర్తిస్తుంది. మినిస్ట్రీస్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌కి ఈ సందర్భంగా అల్‌ కాస్తి కృతజ్ఞతలు తెలిపారు. పార్షియల్‌ కర్‌ఫ్యూ ఎత్తివేత నేపథ్యంలో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ అవసరం లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కో-ఆపరేటివ్స్‌ తప్పనిసరిగా మాస్క్‌లను అందించాలనీ, తమ పరిసరాల్ని ఎప్పటికప్పుడు స్టెరిలైజ్‌ చేయాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com