నటుడు వంశీ చాగంటికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- September 02, 2020నటుడు వంశీ చాగంటి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్ నెం.1 చిత్ర యూనిట్.ఈ మాయ పేరేమిటో, సూర్యకాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజయ్ హీరోగా SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బృంద రవిందర్ దర్శకత్వంలో E. మోహన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వంగవీటి చిత్రంతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న వంశీ చాగంటి నటిస్తున్నారు. సెప్టెంబర్ 2 వంశీ చాగంటి పుట్టినరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
రాహుల్ విజయ్, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్ ఎల్లుమహంతి,
సంగీతం: మణిశర్మ,
ఎడిటింగ్: కోటగిరి వెంటేశ్వర రావు,
స్టంట్స్: విజయ్,
లిరిక్స్: అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్,
నిర్మాత: E. మోహన్,
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: బృంద రవీందర్.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..