దుబాయ్‌ ‘టి3’లో స్మార్ట్‌ గేట్స్‌ పాస్‌పోర్ట్‌ స్కాన్‌

- September 03, 2020 , by Maagulf
దుబాయ్‌ ‘టి3’లో స్మార్ట్‌ గేట్స్‌ పాస్‌పోర్ట్‌ స్కాన్‌

దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులు స్మార్ట్‌ గేట్స్‌ వినియోగించుకోవడానికి మళ్ళీ వీలు కల్పిస్తున్నారు. టెర్మినల్‌ 3లో ఈ స్మార్ట్‌ గేట్స్‌ని రీ-యాక్టివేట్‌ చేసినట్లు జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ వెల్లడించింది. పాస్‌పోర్టుల్ని మాత్రమే స్కానింగ్‌ చేయడానికి వీలుగా డిపార్టింగ్‌ ప్యాసింజర్స్‌ ఈ స్మార్ట్‌ గేట్‌ని వినియోగించాల్సి వుంటుంది. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ - దుబాయ్‌ - మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ మర్రి మాట్లాడుతూ, ట్రావెల్‌ ప్రొసిడ్యూర్స్‌ సులభతరం చేసేందుకు ఈ స్మార్ట్‌ గేట్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో ఈ స్మార్ట్‌ గేట్స్‌ అవసరం ఎంతైనా వుందని అన్నారు. దుబాయ్‌ విమానాశ్రయంలో కోవిడ్‌ మెజర్స్‌ పాటిస్తున్నట్లు వివరించారాయన.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com