బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9 మంది మహిళలు మృతి

- September 04, 2020 , by Maagulf
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9 మంది మహిళలు మృతి

కడలూరు:తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా మహిళలే అని అధికారులు అంటున్నారు. ఘటనాస్థలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందినట్టు.. అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో... కడలూరు జిల్లాలోని కట్టుమన్నార్‌ కోయిల్‌ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com