అపోలో తో ఒప్పందం:యూఏఈ వెళ్లే ప్రయాణిలకు గమనిక

- September 05, 2020 , by Maagulf
అపోలో తో ఒప్పందం:యూఏఈ వెళ్లే ప్రయాణిలకు గమనిక

హైదరాబాద్:అంతర్జాతీయ ప్రయాణీకుల ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడమేలా అన్నది నేడు దేశాల ముందున్న పెద్ద సవాల్.యూఏఈ లో అతి పెద్ద ల్యాబొరేటరీ నెట్ వర్క్ అయిన ప్యూర్ హెల్త్ వారు అపోలో హెల్త్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అనుబంద సంస్థ అయిన అపోలో డయాగ్నస్టిక్, భారత దేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన డయాగ్నస్టిక్ సమూహం వారి తోడ్పాటుతో ఈ సవాలును ఎదుర్కోవడానికి సన్నద్దమవుతున్నారు.యూఏఈ దేశానికి వెళ్లాలనుకొనే ప్రయాణికులకు కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించడానికి ప్యూర్ హెల్త్ మరియు అపోలో డయాగ్నస్టిక్స్ వారు కలసి పని చేయనున్నారు.ఇలా యూఏఈ కు వచ్చే వారిని కోవిడ్ 19 కి సంబందించిన స్క్రీనింగ్ చేసి తద్వారా వారి ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి UAE ప్రభుత్వం వారు ప్యూర్ హెల్త్ ను నియమించారు.హైదరాబాద్ మరియు విజయవాడలలో సేవలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా చంద్ర శేఖర్, గ్రూప్ CEO, అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ మాట్లాడుతూ ప్యూర్ హెల్త్ సంస్థ కోవిడ్ 19 మహమ్మారిని నిరోధించడానికి చేస్తున్న కృషి కి తోడ్పాటు అందించడం మా కెంతో సంతోషాన్ని కలిగించే అంశమని తద్వారా UAE కి వెళుతున్న ప్రయాణికుల ప్రయాణాన్ని సురక్షితం చేయగలుగుతున్నామని అన్నారు.భారత దేశంలో అత్యంత పెద్దదైన డయాగ్నస్టిక్ చైన్ అయిన అపోలో డయాగ్నస్టిక్స్ ఎంతో గొప్ప ఆశయంతో చేస్తున్న ఈ పనిని అత్యంత సమర్థవంతంగా పూర్తి చేయడానికి సన్నద్దమై ఉందని, తమపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని చెప్పారు.

ఈ స్క్రీనింగ్ నిర్వహించడానికి అపోలో డయాగ్నస్టిక్స్ వారు దేశంలో 9 కలెక్షన్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.  ఇందులో భాగంగా హైదరాబాదులోని నల్లగండ్ల, వెస్ట్ మారేడ్ పల్లి కేంద్రాలు, విజయవాడ లో ఉన్న వెంకటేశ్వర పురం కేంద్రం, కలకత్తాలోని లేక్ టౌన్, ముదైలి, పూణె లో వాకాడ్, బవ్దాన్, ధనోరి కేంద్రాలు, ఢిల్లీ లో (ఇంటి వద్దనే సేకరణ) ఉన్నాయి.  

ఈ సేవలను వినియోగించుకోవడానికి UAE వెళుతున్న ప్రయాణీకులు ముందుగా screening.purehealth.ae  అనే వెబ్ సైట్ లోనికి వెళ్లి తమ నివాస ప్రాంతం తో పాటు చేయించుకోదలచిన సమయాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ సమయంలోనే వారు తమ చెల్లింపులను ఆన్ లైన్ లో పూర్తి చేసి స్థానిక ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వైద్యుని సిఫార్సు, ఆధార్ కార్డ్, పాస్ పోర్టు మరియు నగదు చెల్లింపులకు సంబంధించిన రసీదు తీసుకొని సంబంధిత కలెక్షన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. 

పరీక్షా ఫలితాలను నేరుగా UAE ప్రభుత్వ అధికారలకు పంపించడం జరుగుతుంది, అలా అందిన ఫలితాలను తమ దేశంలోనికి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద నున్న బోర్డర్ కంట్రోల్ డేటాబేస్ ద్వారా సరిపోల్చుకొంటారు.  దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ప్రయాణికులు అపోలో డయాగ్నస్టిక్స్ వారిని 040 44442424 లో సంప్రదించవచ్చు. 

ఈ సందర్భంగా మారియా ఎల్ హవురి, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్యూర్ హెల్త్ వారు మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా చూసే భాద్యతను UAE ప్యూర్ హెల్త్ కు అప్పగించిందని తెలిపారు.  ఈ భాద్యతను నిబద్దతతో నూటికి నూరు శాతం నిర్వహించాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధృవీకరించబడిన మరయు అక్రిడియేటెడ్ వ్యవస్థలతో మాత్రమే మేం ఒప్పందం కుదుర్చుకోవడం వలనే సాధ్యం అని భావిస్తున్నామన్నారు.  ఇలా ప్రయాణికులకు అత్యున్నత శ్రేణి సేవలను అందించడమే కాకుండా స్క్రీనింగ్ విధాన అమలులో అత్యధిక నాణ్యత ను ఖచ్చితంగా అమలు చేయగలగిన అపోలో డయాగ్నస్టిక్స్ వారితో మేం భాగస్వాములైనామని వివరించారు.

తమ దేశంలోనికి వచ్చే ప్రయాణికులందరూ కోవిడ్ 19 పరీక్షలో నెగిటెవ్ అని నిరూపించే రిపోర్టును ఖచ్చితంగా అందజేయాలన్న నిబంధన UAE ప్రభుత్వం తీసుకొని వచ్చింది.  ఈ రిపోర్టు లేదా సర్టిఫికేట్ లేని వారిని సంబంధిత విమానాన్ని ఎక్కడానికి అనుమతించరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com