ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన హీరో సుధీర్ బాబు
- September 05, 2020హీరో సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన
ఇన్ స్పైరింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే వీ సినిమా షూటింగ్ కు కొద్ది రోజుల
ముందే సుధీర్ బాబు మోకాలు గాయంతో బాధపడ్డారు. మోకాలుకు అనేక ఫిజియోథెరపీల
అనంతరం కోలుకున్నారు. ఈ క్రమంలో ఎంతో నొప్పి భరించారు. అలా తన మోకాలు
బలాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాసెస్ అంతటినీ వీడియోగా చేసి శనివారం తన
ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేశారు సుధీర్ బాబు.
ఆ వీడియోలు సుధీర్ బాబు మాట్లాడుతూ...నేను ఎంత కష్టాన్ని అనుభవించానో
చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి
స్ఫూర్తి కలిగించేందుకు ఈ వీడియోతో ప్రయత్నిస్తున్నా. కష్టమొస్తే చీకట్లో
ఉండొద్దు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయండి. వీ సినిమాకు కొన్ని నెలల
ముందు నా మోకాలుకు గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. నొప్పిని
తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించా, వ్యాయామాలు చేశాను. ఆ నొప్పి
భరించడాన్ని ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ నా సినిమా, నా ప్రేక్షకులు. అని
అన్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..