ఒమనైజేషన్, ఉద్యోగ కల్పన ప్రణాళికపై ప్రైవేట్ సంస్థలతో కార్మిక శాఖ చర్చలు
- September 05, 2020
మస్కట్:ప్రవాసీయుల ఉపాధికి మరో గండం పొంచి ఉంది. ఒమనైజేషన్ లో భాగంగా స్థానికులకు ఉద్యోగవకాశాలను మరింత మెరుగుపరిచే దిశగా ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు ఇండస్ట్రియల్ జోన్, సోహర్ ఇండస్ట్రియల్ పోర్ట్ లో పర్యటించిన కార్మిక శాఖ అధికారులు..పలు ప్రైవేట్ సంస్థల్లో ఒమనీయులను భర్తీ చేసే అవకాశాలు, కొత్త ఉద్యోగాల కల్పించటంపై చర్చించారు. ఉత్తర అల్ బటినా గవర్నరేట్ పరిధిలోని OQ గ్రూప్, సోహర్ ఇండస్ట్రియల్ పోర్ట్, వేల్ ఒమన్ కంపెనీ, జిందాల్ షేదీడ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, అలాగే మజన్ ఎలక్ట్రిసిటీ కంపెనీలలో పర్యటించారు. మంత్రిత్వ శాఖతో ప్రైవేట్ సంస్థల మధ్య భాగస్వామ్యం, సత్సంబంధాల బలోపేతానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పై చర్చించారు. అలాగే ఆయా కంపెనీలలో అవసరమైన కార్మిక శక్తి, ఉద్యోగావకాశాలపైనా డిస్కస్ చేశారు. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం బలోపేతంపై కూడా కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!