ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..
- September 06, 2020
కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఈ లీగ్‌లో మొదటి మ్యాచ్ అబుదాబీలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది. ఇక ఆ తర్వాత రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య దుబాయ్‌లో.. అలాగే మూడో మ్యాచ్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుంది.
ఇక సెప్టెంబర్ 22 రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తోొ ఐపీఎల్ యాక్షన్ షార్జాకు షిఫ్ట్ అవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఈసారి 10 డబుల్ డెక్కర్ మ్యాచులు ఉండగా.. నైట్ మ్యాచులు అరగంట(రాత్రి 7.30కి) ముందు మొదలు కానున్నాయి. మొత్తంగా 24 మ్యాచులు దుబాయ్‌లో, 20 మ్యాచులు అబుదాబీ,. 12 మ్యాచులు షార్జాలో జరుగనున్నాయి. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల డేట్స్ వివరాలను మాత్రమే విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
#IPL2020 #IPLinUAE #IPLSchedule #IPL pic.twitter.com/T7g0eiIS50
— Maa Gulf (@maagulf) September 6, 2020
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?