భారత దేశంలో కరోనా కల్లోలం
- September 06, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డ్ లెవల్‌లో 90,632 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజు వ్యవధిలో 90వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు వెలుగుచూడలేదు. దీంతో ఆదివారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 41,13,811 చేరింది. ఫలితంగా కరోనా కేసుల్లో ప్రపంచంలోనే సెకండ్ ప్లేసులో ఉన్న బ్రెజిల్‌కు ఇండియా చేరువయ్యింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 41లక్షల 23వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 31లక్షల మంది రికవర్ అవ్వగా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం దాటింది. మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.
దేశంలో మొత్తం కేసులు 41,13,811
కొత్త కేసులు 90,632
ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 8,62,320
దేశంతో మొత్తం కరోనాతో చనిపోయినవారు 70,626
శనివారం మృతుల సంఖ్య 1065
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







